జాతి రత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ అనుకున్న స్థాయిలో రాలేదు. ఇటీవలే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
ఇక ఇప్పుడు బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. అలాగే జనవరి 14న స్టార్ట్ కాబోతున్న రవితేజ రావణాసుర సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే మొత్తం ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా అందులో ఒక హీరోయిన్ గా ఫరియాను సెలెక్ట్ చేశారు.
అయితే సోలో హీరోయిన్ గా మాత్రం సరైన చాన్స్ రాలేదు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు సోలో హీరోయిన్ గా మరో ఛాన్స్ వచ్చింది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్న సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా ను సెలెక్ట్ చేసారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తోందట.