అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ టైటిల్ తో ఈ సినిమాను ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి ఈ చర్చను మొదలుపెట్టడం విశేషం.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ లో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందనే ప్రశ్న ఎదురైంది సందీప్ కి. దీనిపై స్పందించిన ఆయన కథ ప్రకారం, ప్రభాస్ సరసన కియరా లేదా రష్మిక అయితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చలు, ఫొటోలు.
ప్రభాస్-రష్మిక, ప్రభాస్-కియరా యానిమేషన్ ఫొటోలతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండుగా విడిపోయారు కూడా. కొంతమంది ఫ్యాన్స్ కియరాను తీసుకోవాలని కోరుతుంటే, మరికొంతమంది మాత్రం రష్మికను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రభాస్ చేతిలో ఉన్న సలార్ పూర్తవ్వాలి, ప్రాజెక్ట్-కె కూడా కొంత పూర్తవ్వాలి. ఈ లోగా సందీర్ రెడ్డి, యానిమల్ సినిమాను పూర్తిచేయాలి. ఇలా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఇప్పట్నుంచే హీరోయిన్ ఎవరనే చర్చ అనవసరం.