శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆనంద్, గోదావరి. ఈ సినిమాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది.
ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా తన నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ఇప్పుడు కమలని ముఖర్జీ ఇంట్రెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లో పెడుతున్నారు.
2004 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది కమలినీ ముఖర్జీ.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని తెలుగులో వరుస సినిమాల్లో నటించింది.టాలీవుడ్ లో చివరిగా గోవిందుడు అందరివాడే సినిమాలో శ్రీకాంత్ కు జంటగా నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపించలేదు.
ఈమె చేసింది అతి తక్కువ సినిమాలే ఆయన ప్రేక్షకులకు గుర్తుంటే పోయే పాత్రలలో నటించారు. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు.
సినిమాలకు దూరమైన కమలినీ ముఖర్జీ అమెరికాలో ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. రీసెంట్‌గా అమెరికాలోనీ డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈమె సందడి చేసింది. అక్కడి నుంచి ఈమె ఫోటోలు బయటకు రావడంతో కమలని ముఖర్జీ లుక్ చూసి నెటిజన్లు బిత్తర పోయారు. ఇలా మారిపోయింది అంటూ ఆ ఫోటోకి కామెంట్లో పెడుతూ దాన్ని షేర్ చేస్తున్నారు.