కొంతమంది హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు లభించదు. కానీ మరికొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. తాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
సినిమా ఆఫర్లు వస్తున్నా.. ఈ బ్యూటీకి మాత్రం సరైన హిట్ రావడం లేదు. ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ చిత్రంతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది కేతిక. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు.
ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యూత్ కి పిచ్చెక్కిస్తోంది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ ని ఆరబోస్తోంది. గ్లామర్ పరంగా, నటన పరంగా కృతి శెట్టి, శ్రీలీలతో పాటు తన జోరును చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు.
గ్లామర్ పరంగా నూటికి నూటొక్క మార్కులు పడ్డాయిగానీ, కథాకథనాల పరంగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ కాస్త వెనకబడింది. ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అవకాశం రావాలి .. దాని వెనుకే సక్సెస్ కూడా రావాలి. ఈ రెండూ రావాలంటే అందుకు తగిన అదృష్టం ఉండాలి. తనని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలోనే ఉంది కేతిక.
View this post on Instagram