మహేంద్ర సింగ్ ధోనితో తన అఫైర్ లైఫ్ లాంగ్ ఉంటుందని అన్నారు హీరోయిన్ లక్ష్మీ రాయ్. ధోనితో జరిగిన బ్రేకప్ గురించి తాజాగా లక్ష్మీ రాయ్ స్పందించారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని తో నేను బ్రేకప్ చేసుకున్నాక చాలా కోల్పోయానని అన్నారు. ఇప్పుడు కూడా ధోని గురించి ఎవరు మాట్లాడినా నా గురించి కూడా టాపిక్ వస్తుందని అన్నారు. నాకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టినా కూడా మా ఇద్దరి అఫైర్ గురించి మాట్లాడుకుంటారని అన్నారు లక్ష్మీ రాయ్. అయితే ప్రస్తుతం మా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని, ఇప్పటికి ధోని మీద నాకు గౌరవం ఉందని చెప్పుకొచ్చింది.
కాగా 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉండగా.. అదే జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా లక్ష్మీ రాయ్ వ్యవహరించింది. అప్పడు ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. డేటింగ్ లో కూడా కొన్ని రోజులు ఉన్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు.