‘అందాల రాక్షసి’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. తన అమాయకమైన మోముతో కుర్రకారును పడగొట్టేసింది. క్యూట్ నెస్ తో ఫ్యాన్స్ ను తనవైపుకు తిప్పుకుంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్ పడటం లేదు. దీంతో తనలోని హట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫొటో షూట్స్ చేస్తోంది. తన ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య.
ఇప్పటి వరకూ లావణ్య 16 చిత్రాల్లో నటించింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ కొత్త కొత్త ఫొటోస్ తో అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కి ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు.
టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాక లావణ్య వెనుకబడిపోయింది. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే.. ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత నెమ్మదించింది.