నటి లావణ్య త్రిపాఠి, మెగా హీరోతో వరుణ్ లు పెళ్లి చేసుకోబోతున్నారు, లావణ్య డేటింగ్ లో ఉంది అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై లావణ్య కూడా మౌనం వహించింది. చివరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ సెషన్‌లో స్పందించింది.
నా వివాహం గురించి నాకు కూడా తెలియదు. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే మరికొంతమంది నెటిజన్లు మెగాహీరోతో వస్తున్న పుకారును ఖండిస్తున్నారా అని అడగగా మౌనంగా ఉండిపోయింది.
ఇక వరుణ్ లావణ్య త్రిపాఠి లు గతంలో మిస్టర్ సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సమయంలోనే వరుణ్, లావణ్య లు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.