సినిమా పరిశ్రమలో నటించడం అంటే అంత ఈజీ కాదు. ఎలాంటి సన్నివేశంలో అయినా సరే వెనకడుగు వేయకుండా నటించాల్సి ఉంటుంది. అలా లేకపోతే కచ్చితంగా కెరీర్ ఉండదు. అలా కష్టపడి కెరీర్ కోసం ముందు అడుగు వేస్తారు. ఇలా తాను కూడా కష్టాలు పడ్డాను అని చెప్పారు లయ. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె కీలక విషయాలు పంచుకున్నారు. తాను చాలా మంది సీనియర్ నటులతో పని చేశా అని చెప్పుకొచ్చారు.
తాను విజయశాంతి తో కలిసి నటించాను అని… సుహాసిని గారితో గెలుపు మూవీలో నటించానని లయ చెప్పుకొచ్చారు. విజయశాంతితో కలిసి తమిళ మూవీలో నటించానని తెలిపారు. మహాచండి పేరుతో ఆ సినిమాను డబ్ చేశారని అన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయం బయట పెట్టారు. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఏనుగు తొండంతో నన్ను కూర్చోబెట్టుకుని నడవాలని అన్నారు.
అయితే తనకు ఏనుగు అంటే భయమని చెప్పుకొచ్చారు. జంతువులు హాని చేయవని అయితే ఇరిటేట్ చేస్తే అవి ఇరిటేట్ అవుతాయని భయపడతానని పేర్కొన్నారు. రిహార్సల్ లో లో ఏనుగు బాగానే చేసిందని టేక్ సమయంలో మాత్రం ఏనుగు ఎత్తుకుని విసిరేసిందని గుర్తు చేసుకున్నారు. శరీరంపై కాలు పెట్టడానికి ఏనుగు ప్రయత్నించిందని అప్పుడు తాను రోల్ అయినట్టు ఆమె పేర్కొన్నారు. నేను ఆ సీన్ లో చెయ్యను అన్నానని కొన్నిరోజుల తర్వాత ఆ సీన్ ను షూట్ చేశారని పేర్కొన్నారు.