ఆ హీరోయిన్ ఇంకా ఆశలు పెట్టుకుందా...? - Tolivelugu

ఆ హీరోయిన్ ఇంకా ఆశలు పెట్టుకుందా…?

Heroine Laya Still Waiting For Important Roles?, ఆ హీరోయిన్ ఇంకా ఆశలు పెట్టుకుందా…?

తెలుగు సినిమాల్లో మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించే హీరోయిన్లే అరుదు. అలాంటి అరుదుగా ఉన్న హీరోయిన్లలో… తన నటనతో మెప్పించిన స్టార్ లయ. స్వయంవరం చిత్రంతో వెండితెరకు పరిచయమైన లయ… ఏడెనిమిదేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజిగా ఉండేది. కానీ ఆ తర్వాత సినిమాలు తగ్గిపోవటం పైగా ఓ అమెరికా సంబంధం రావటంతో పెళ్లి చేసుకోని అమెరికాలో సెటిల్ అయిపోయింది లయ.

స్వీడన్ రాజ దంపతులపై భారత్ లో ప్రశంసలు

సీఎం కోడలు… ఏంటా ఫోటోలు ?

ఇటీవల రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనపడింది లయ. అయితే… ఆ పాత్ర తను చేయాల్సింది కాకపోయినా… ఆ సినిమాలో లయ కూతురు ఓ రోల్ చేసిందట. పైగా షూటింగ్ అమెరికాలోనే కావటంతో లయ రెగ్యూలర్‌గా షూటింగ్ స్పాట్‌కు వెళ్లటంతో… అక్కడ ఓ చిన్న పాత్రలో చేయాల్సి వచ్చిందని అప్పట్లో తనతో పాటు సినిమా యూనిట్ కూడా చెప్పారు.

మైనస్ త్రీ డిగ్రీస్ చలిలో అమితాబ్ బచ్చన్…

జబర్ధస్త్ రష్మీ పెళ్లికి లైన్ క్లియర్
అయితే, అవకాశాలు లేకే లయ ఆ పాత్ర చేసింది అన్న వారు కూడా లేకపోలేదు. కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం… లయకు అరవింద సమేతలాంటి పెద్ద చిత్రంలో ఓ క్రూషియల్ రోల్ ఇచ్చారట. ఎక్కువ సేపు ఉండే పాత్రతో పాటు, మంచి పాత్ర కూడా. కానీ తన పాత్రలో నవీన్ చంద్రకు తల్లిగా, జగపతిబాబుకు భార్యగా చేయాల్సిన క్యారెక్టర్. ఇప్పుడే తను అక్క, అమ్మ పాత్రలా అంటూ లయ వెనక్కి తగ్గటంతో ఆ పాత్ర ఈశ్వరీరావు చేశారు.

”జీవితం నాకు రెండో అవకాశం ఇచ్చింది” : మనీషా కొయిరాల

ఇండస్ట్రీ మర్చిపోతున్న సందర్భంలో… అక్క, అమ్మ పాత్రలు కాకుండా మళ్లీ హీరోయిన్ పాత్రలు ఎలా వస్తాయనుకుందో లయ…!

Share on facebook
Share on twitter
Share on whatsapp