బాల నటిగా ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మీనా. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా కొన్నాళ్లకు భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ మృతి చెందారు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన మరణానికి ఇదే కారణం అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యాసాగర్ కు మొదటి నుంచి ఊపిరితిత్తుల సమస్య ఉందని అయితే పావురాలతో అది ఎక్కువ అవ్వటం వల్ల ఆయనకు ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అయ్యి మృతి చెందారని వార్తలు వచ్చాయి.
అనసూయ ప్లేస్ లో హాట్ యాంకర్? జబర్దస్త్ ఇక మామూలుగా ఉండదు!
అయితే ఇలా భర్త మృతి గురించి రకరకాల వార్తలు రావడంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మీనా. తన కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. మా ప్రైవసీ భంగం కలిగించద్దు. నా భర్త మరణం గురించి అసత్య ప్రచారాలు చేయకండి.
పవిత్రను చెప్పుతో కొట్టబోయిన నరేశ్ మూడో భార్య
కఠిన తరమైన పరిస్థితుల్లో తోడుగా నిలిచిన మిత్రులందరికీ అభిమానులకి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్ గారికి కూడా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.