మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తుంది. కాగా తాజాగా నయన్‌తో హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.
సెట్స్ లో డైరెక్టర్ మోహన్ రాజా తో దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో నయనతార బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తోంది. ఇక ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
కొణిదెల సురేఖ సమర్పణ లో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అలాగే చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా భోళా శంకర్ వాల్తేరు వీరయ్య సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.