సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డీజే టిల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. గత శనివారం విడుదలైన ఈ చిత్రానికి యువ దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో, దర్శకుడు విమల్ కృష్ణ, హీరోయిన్ నేహా శెట్టి మంగళవారం విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.
వీరిద్దరూ ఉదయం దుర్గాదేవికి ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీజే టిల్లు సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ప్రిన్స్ సిసిల్, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందించారు.
దానికి తోడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. ఇక డీజే టిల్లు దెబ్బకి ఖిలాడీ కలెక్షన్స్ పడిపోయాయి. మరో నాలుగు రోజులు కొత్త సినిమాలు లేవు కాబట్టి కలెక్షన్స్ ఇంకా రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
Director @K13Vimal & @iamnehashetty visited శ్రీ కానక దుర్గమ్మ వారి దేవాలయం, విజయవాడ. ✨#BlockbusterDJTillu in theatres now! 🤩#DJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/YfmFwZ117G
— Sithara Entertainments (@SitharaEnts) February 15, 2022