ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు గుండెల్లోకి దూసుకు పోయిన రాజస్థానీ భామ పాయల్ రాజ్ పుత్. గ్లామర్ రోల్స్ లో నటిస్తూ రొమాంటిక్ రాజ్ పుత్ గా టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంది.
అయితే హఠాత్తుగా ఈ ఆర్ఎక్స్ బ్యూటీ అభిమానులకు షాక్ ఇచ్చింది.తన హెల్త్ ఇష్యూ ఉందనే చేదువార్తని అభిమానులకు షేర్ చేసింది. పాయల్ సోషల్ మీడియా వేదికగా తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపింది. కొద్దిరోజులుగా ఈ డిసీజ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపింది పాయల్. సెలైన్ పెట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
నేను మంచి నీరు చాలా తక్కువ తాగుతా..అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది. దాంతో నేను అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అయ్యాను.
నా నెక్స్ట్ మూవీ షూటింగ్ లో త్వరలోనే పాల్గొంటా.. మీరందరూ ఎక్కువగా నీరు తాగండి..మీశరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. జాగ్రత్తా’ అంటూ రాసుకొచ్చింది పాయల్. దాంతో పాయల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. రోజుకొకరు తమకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి బయట పెట్టి షాక్ ఇస్తున్నారు.
ఇప్పటికే సమంత సమస్య గురించి తెలుకుసుకున్న అభిమానులు బయట పడలేదు. ఆ తర్వాత రేణు దేశాయ్ కూడా తనకు అనారోగ్య సమస్య ఉంది చెప్పి మరింత షాక్ ఇచ్చారు. ఇప్పుడు పాయల్ రాజ్