ప్రభాస్ సైలెంట్ గా ఉంటారు, సిగ్గు పడతాడంటూ భయట ప్రచారం ఉందని… కానీ అందరు అనుకున్నట్లుగా మాత్రం కాదంటోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. రాధేశ్యామ్ షూటింగ్ లో ప్రభాస్ తనను కొన్నిసార్లు ర్యాగింగ్ చేశాడని తెలిపింది.
సెట్లో ఉంటే ప్రభాస్ మరీ అంత సిగ్గు పడే వ్యక్తిగా ఏం ఉండరు. ఆయనతో ఉంటే కో యాక్టర్స్ తో చాలా ఫ్రీగా ఉంటారని తెలిపింది. సెట్లో ప్రభాస్ ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుందని, కానీ తెలియని వాళ్లతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన సిగ్గుపడతారని తెలిపింది.
ఇక రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ… ఇది అన్ని ప్రేమకథల్లాంటిది కాదు. కొత్తగా ఉంటుంది. చిత్రీకరణ మొదలైన తొలి రోజు నుంచే మేం స్నేహితులుగా మారడం వల్ల మా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వచ్చిందని తెలిపింది. సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని హామీ ఇచ్చింది. పూజా రాధేశ్యామ్ తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, సర్కస్, ఆచార్య సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.