తన అందంతో, కళ్ళతో మత్తెక్కించే బ్యూటీ ప్రణీత. టాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు లేకపోయినా ఈ అమ్మడు చిన్నోదో పెద్దదో వచ్చిన క్యారెక్టర్లు చేసుకుని పోతుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికిదారేది సినిమాతో రికార్డు బ్రేక్ హిట్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడికి స్టార్ డమ్ అయితే రాలేదు. ప్రణీత కూడా సెకండ్ హీరోయిన్ గానే ఫిక్స్ అయిపొయింది. మరో వైపు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ప్రణీత రకరకాల స్టిల్స్ తో కుర్రకారుకి మత్తెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రణీత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బులెట్ పై కూర్చుని ఈ అమ్మడు పెట్టిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రణీత పై ఉన్న ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.