విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కూడా టాలీవుడ్ లో క్యూట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండింటిలో కూడా ఈ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా అనిపించింది.
అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా వారివారి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా ఆదివారం షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరకడంతో బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఎప్పటినుంచో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నప్పటికీ మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.