సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచే విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ రష్మిక మందన్న.
బాలీవుడ్ నాట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…
అల్లు అర్జున్, ఫహద్ లు తమ కళ్ళతోనే బెస్ట్ ఇవ్వగలగడం నేను గమనించానని… అలాగే అడవిలో ఫైట్స్ కానీ ఇంకా డాన్సులు కానీ ఇవన్నీ రియల్ గా చేశారని దాదాపు 70 శాతంకి పైగా నిజ జీవిత ప్రాంతాల్లోనే తెరకెక్కించబడినవి అని చెప్పుకొచ్చారు రష్మిక. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.