గ్లామర్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈ టైంలో… నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న హీరోయిన్ సాయిపల్లవి. దక్షిణాది భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న ఆమె తెలుగులో విరాట పర్వం మూవీ చేస్తోంది. వేణు ఉడుగుల రూపొందిస్తున్న ఈ చిత్రం నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి రానాపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. విరాట పర్వం సినిమాలో నాది చాలా కీలకమై పాత్ర అని, సినిమాల్లో హీరోయిన్ రోల్ ఎంత కీలకమైనా ఆమె పేరు సినిమా పోస్టర్స్ లో హీరో కన్నా ముందు పేరు వేసేందుకు హీరోలు ఇష్టపడరని వ్యాఖ్యానించింది. అయితే, రానా మాత్రం… విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కన్నా ముందు సాయి పల్లవి పేరు వాడాలని చెప్పారని, రానా సమానత్వాన్ని చూసి సంతోషం వేసిందని… అలాంటి వ్యక్తితో పనిచేయటం అదృష్టమంటూ సాయి పల్లవి కామెంట్ చేసింది.