హీరోయిన్స్ ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ పేరు ఎత్తగానే ఆ రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో సాయి పల్లవి కూడా చేరిపోయింది. మహేష్ బాబును పొగడ్తలతో ముంచెత్తింది.
ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గురించి మాట్లాడుతూ… ఆయన ఎంతో అందంగా ఉంటారని, ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా ఉండదు. ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యమని ఆయన ఫొటోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందంటూ కామెంట్ చేసింది. అంతేకాదు మహేష్ చర్మం మెరుస్తుంటుందని, ఆయన ఫొటోలను అప్పుడప్పుడు జూమ్ చేసి చూస్తుంటాను అని పేర్కొంది.