సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ మలయాళ చిత్రం చిత్తిరై సెవ్వానం తో తెరంగేట్రం చేసింది. ఫైట్ కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన స్టంట్ సిల్వా చిత్రంతో పూజా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రం శుక్రవారం నుంచి జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. కాగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని ఆయన సోదరి సాయి పల్లవి కోరారు. సోదరి పూజ సినిమాల్లోకి రావడం చూసి ఎంతో గర్వపడుతున్నా అంటూ ఓ నోట్ విడుదల చేశారు సాయి పల్లవి.
అలాగే పూజా సినిమాకి సంబంధించిన పోస్టర్,చిన్ననాటి ఫోటోను పంచుకుంటూ, ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే మొదటి నుండి నాకు మాత్రమే తెలిసినదాన్ని ప్రపంచం చూస్తోంది. చిత్తిరై సెవ్వానం చిత్రంలో పూజ తొలిసారిగా నటిస్తోందని దానిని చూసి సినీ ప్రేక్షకులు అంతా కూడా పూజకు కొంత ప్రేమను అందించాలని కోరింది. దర్శకుడు ఏఎల్ విజయ్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా కన్నన్ తో పాటు సముద్రఖని, రిమా కల్లింగల్ నటిస్తున్నారు.ఇక ప్రస్తుతం సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Advertisements