శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే మంచి వసూళ్లను కూడా సాధించింది.అయితే ఈ సినిమాకు సంబంధించి సాయిపల్లవి డాన్స్ పై ట్వీట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఎప్పటిలానే సెన్సేషనల్ .. అసలు ఈ అమ్మాయికి బోన్స్ ఉన్నాయా!! ఇలాంటి డాన్స్ ను ఇంతవరకూ స్క్రీన్ పై చూడలేదు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై సాయి పల్లవి స్పందించారు.
మీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ను నేను ఊహించలేదు. మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను. నేను మీ అభిమానిని, నాలో ఉన్న మీ అభిమాని ఇప్పటికే మిలియన్స్ టైమ్ ఈ ట్వీట్ ను చదివేసింది అంటూ పోస్ట్ పెట్టింది.