ప్రేమమ్ తో నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చూస్తూ, స్కిన్ షోను నమ్ముకోని ఈ బ్యూటీ ఇటీవల ఓ భారీ యాడ్ ను వదులుకుంది. దాదాపు 2కోట్ల రెమ్యూనరేషన్ ఉన్న ఆ యాడ్ వదులుకోవటం వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇటీవలే సాయిపల్లవి భయట పెట్టింది.
ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ వదులుకున్న మాట నిజమే. అది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అందం, స్కిన్ కలర్ అనే వాటికి మన సమాజంలో ఎంతో విలువ ఉంది. నా మొహం మీద ఉన్న మొటిమలు పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించా. ఇంట్లో నుండి భయటకు వెళ్లాలనిపించేంది కూడా కాదు. అందరు నన్ను కాకుండా నా మొటిమల గురించే మాట్లాడుతారేంటీ అనుకునే దాన్ని. తెల్లగా మారేందుకు నా సోదరి కూడా ఎంతో ప్రయత్నించేంది. కానీ ప్రేమమ్ నుండి జనం నన్నుగా ఇష్టపడటం నచ్చింది. అది ఎందరికో ప్రేరణ అయ్యింది. అందుకే ఆ యాడ్ వదులుకున్నానని తెలిపింది.