తాను ఏ పాత్రలోనైనా నటించగలను అని నిరూపించుకుంది హీరోయిన్ సమంత. సమంత ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు ఐటమ్ సాంగ్స్ కి కూడా ఓకే చెప్తుంది. ఇక తమిళంలో ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నయనతార కూడా నటిస్తున్నారు.
కాగా ఇందులో సమంత పాత్ర సరికొత్త విలనిజం తో ఉండబోతుందట. అలాగే ఈ సినిమాలో సమంత పాత్ర కథలో కీలక మార్పులకు కారణం అవుతుందట. మరోవైపు ఈ సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. మరి చూడాలి సమంత విలనిజం ఈ సినిమాలో ఏ మేర ఉంటుందో.