అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ ఇద్దరు స్టార్స్ కూడా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి వివాదం చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఓ నెటిజన్స్ చేసిన ట్వీట్ కు సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
సమంత విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్.. ఒక జెంటిల్మెన్ నుండి ఫ్రీ గా రూ. 50 కోట్లు దోచుకుంది. అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతే కాదు సమంత కు టాగ్ కూడా చేశాడు.
ఆ ట్వీట్ పై సమంత స్పందిస్తూ నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021
Advertisements