పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తున్నారు. నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఫిబ్రవరి 25న థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, రానా డానియల్ శేఖర్ గానటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రానా సరసన నటిస్తున్న సంయుక్తమీనన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కార్ డ్రైవింగ్ చేస్తూ భీమ్లా నాయక్ సాంగ్ వింటూ కనిపించింది సంయుక్త.
ఇది చూసిన పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలోనే తనకు ఈ సాంగ్ అంటే ఇస్తామని చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.
Play #lalabheemla , Drive ❤️❤️❤️ pic.twitter.com/l4HpOXDy5j
— Samyuktha (@iamsamyuktha_) February 9, 2022
Advertisements