కేవలం రెండు సన్నివేశాలతో మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ తన సత్తాను నిరూపించుకుంది. ఇప్పుడు చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆమెకు అభిమానులుగా కూడా మారారు.
భీమ్లా నాయక్ చిత్రంలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో సంయుక్త నటించింది. కనిపించింది కాసేపే అయినా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియా పేజీల్లో సంయుక్త ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా బికినీలో సంయుక్త దిగిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. స్విమ్ షూట్ లో ఈ మలయాళ బ్యూటీ వంపుసొంపులు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక తన మొట్టమొదటి తెలుగు చిత్రం “సర్” కోసం దనుష్‌తో జత కట్టింది. ఈ సినిమా షూటింగ్ దశలో ప్రస్తుతం ఉంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయితే సంయుక్త కెరీర్ టర్న్ అయినట్టే. వరుస అవకాశాలు రావటం పక్కా.