నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది హీరోయిన్ త్రిష. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా వన్నె తరగని అందంతో, తన నటనతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ అవడంతో కొద్దిగా అవకాశాలు తగ్గాయి.
అయినప్పటికీ ఓవైపు సీనియర్ హీరోలకు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం బృంద అనే వెబ్ సిరీస్ లో త్రిష నటిస్తుంది.
ఇందులో ఆమె పవర్ ఫుల్ కాప్ గా నటిస్తుంది. విశేషం ఏంటంటే తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా పోలీస్ యూనిఫామ్ లో త్రిష కనిపించనుంది.
ఇక ఈ వెబ్ సీరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో స్ట్రీమ్ కాబోతోంది. కాగా ఖాకీ డ్రెస్ లో త్రిష లుక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.