అనేక కారణాల వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పడు ఎట్టకేలకు పవన్ డేట్స్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ కూడా లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇక ఈ సినిమా ఒక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో నిధి అగర్వాల్‌ను హీరోయిన్ గా నటిస్తుండగా యువరాణి పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు జాకీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కోవడంతో కొత్త యువరాణిని వెతికేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఆ యువరాణి పాత్ర కోసం కత్రినా కైఫ్, దిశా పటానీ పేర్లు అనుకున్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గారట మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… నర్గీస్ ఫక్రీ (ప్రఖ్యాత రాక్‌స్టార్) ని యువరాణి పాత్ర కోసం అనుకుంటున్నారట. నిజానికి ఈ సినిమా స్టార్టింగ్ నుండి హీరోయిన్స్‌తో ఇబ్బంది పడుతోంది.