ఇండస్ట్రీ కి చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మన్ననలను పొందుతారు. అయితే నిజానికి చాలా మంది హీరోయిన్లకు సినిమాల్లోకి రాకముందు కొన్ని పేర్లు ఉంటాయి. సినిమాల్లోకి వచ్చాక ఆ పేర్లు మారిపోతూ ఉంటాయి. అయితే సినిమాల్లోకి రాకముందు సౌత్ టాప్ హీరోయిన్స్ పేర్లు ఏంటి ? ఇప్పుడు ఆమెను ఏ పేరుతో ప్రేక్షకుల పిలుస్తున్నారు… అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది మీరు తప్పకుండా చదవాల్సిందే.
మొదటిగా సీనియర్ నటి జయసుధ. ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన జయసుధ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్, హీరో తల్లిగా నటిస్తుంది. అయితే సినిమాల్లోకి రాకముందు జయసుధ అసలు పేరు సుజాత. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు జయసుధ గా పేరు మార్చారు.
మరొక హీరోయిన్ జయప్రద. జయప్రద అసలు పేరు లలితారాణి. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు ఈమె. రెండుసార్లు ఎంపిగా కూడా గెలుపొందారు.
అలాగే అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ సినిమాల్లోకి వచ్చాక శ్రీదేవి గా మారిపోయింది.
మరో హీరోయిన్ సౌందర్య. సౌందర్య కూడా పేరుకు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ సొంత రాష్ట్రం కర్ణాటక. సినిమాల్లోకి రాకముందు సౌందర్య అసలు పేరు సౌమ్య.
హీరోయిన్, ఫైర్ బ్రాండ్ రోజా… రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రోజా గా పేరు మార్చారు.
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఒకవైపు చిరు, మరోవైపు బాలయ్య ఫొటోస్ ఉంటాయట ఎందుకంటే ?
అలాగే విజయవాడ కు చెందిన అలనాటి హీరోయిన్ రంభ. రంభ అసలు పేరు విజయలక్ష్మి. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటు శ్రీలంకలో సెటిలైంది.
సౌత్ స్టార్ నెంబర్ వన్ హీరోయిన్ నయనతార… నయనతార కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఇండస్ట్రీకి వచ్చాక నయనతార గా పేరు మార్చుకుంది.
Advertisements
షూటింగ్ లో గాయపడిన పదిమంది టాలీవుడ్ నటులు! ఏ సందర్భాల్లో జరిగాయంటే?
ఇక మరో స్టార్ హీరోయిన్ అనుష్క. అనుష్క ఇండస్ట్రీలోకి రాకముందు అసలు పేరు స్వీటీ శెట్టి. కర్ణాటక మంగళూరు కు చెందిన అనుష్క సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అనుష్క గా పేరు మార్చుకుంది.
నిజానికి వీరితో పాటు ఇంకా చాలా మంది పేర్లు మార్చుకుని హీరోయిన్స్ గా ఉన్నారు. అయితే వారి అసలు పేరు మాత్రం ఇంకా బయటికి తెలియ రావట్లేదు.