సంక్రాంతి బరిలో హీరోలతో పాటు హీరోయిన్‌లు కూడా పోటీ పడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. మరోవైపు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్న నటిస్తుంది. ఈ ఇద్దరు టాలీవుడ్ లో మంచి క్రేజ్ లో ఉన్నారు. గద్దలకొండ గణేష్ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్నా పూజా అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టి మరింత క్రేజ్ పెంచుకోవాలని చూస్తుంది.
మరోవైపు చేసిన 4 సినిమాలతోనే టాలీవుడ్ లో టాప్ రేంజ్‌కు చేరుకున్న రష్మిక మహేష్ సరిలేరునీకెవ్వరు సినిమాతో కొట్టి క్రేజ్ ను డబుల్ చేసుకుందామని చూస్తుంది. ఇప్పటికే బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా రష్మిక నటించనుంది. ఇక పోతే టాలీవుడ్ లో హిట్ కొట్టిన హీరోయిన్ వెనుక దర్శక, నిర్మాతలు పడటం ముందు నుంచి ఉన్నదే. మరి ఈ బామలు హిట్ కొట్టి టాప్ లో నిలుస్తారో లేక బోర్లా పడతారో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.