హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ ఉంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఇలా ప్రతి దానిలో కూడా ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం వీటన్నింటితో పాటు యూట్యూబ్ లో కూడా తమ పేరుతో ఛానల్స్ ను ఓపెన్ చేసి తమ వ్యక్తిగత వృత్తిరీత్యా విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. వారిలో మొదటి గా చెప్పుకోవాల్సిన పేరు అలియా భట్. అలియా భట్ యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆహారం, ఆరోగ్యం, ఫిట్నెస్, దుస్తులు, మేకప్ సినిమాలకు సంబంధించిన విషయాలు…ఇలా అన్నింటినీ కూడా యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటారు.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్… రకుల్ ప్రీత్ సింగ్ కూడా రకరకాల వీడియోలను యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తాను ఎంతో ఇష్టపడే ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలను కూడా రకుల్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మంచు లక్ష్మి, చిట్టి చిలకమ్మా పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఛానల్ లో చిన్న పిల్లలకు సంబంధించిన విషయాలను వారి హెల్త్ పోషకాహారాలు ఇలా రకరకాల విషయాలను పెంచుకుంటూ ఉంటారు.
అలాగే హీరోయిన్ సదా…. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ కూడా తన యూట్యూబ్ ఛానల్ లో ఆహారం, తయారు చేసే వంటకాలు, రుచులు, అభిరుచులు గురించి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఐదేళ్ల కిందట యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. ఈ చానల్ లో సమయం దొరికినప్పుడల్లా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీరందరూ కూడా యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోవర్స్ ను కలిగి ఉండటం విశేషం.