తెలుగు సినిమా తరం మారింది. ఒకప్పటి కుర్ర హీరోలు ఇప్పుడు సీనియర్ హీరోలయ్యారు. చూస్తుండగానే నడి వయసు నుంచి కొందరు అరవైకి దగ్గరపడ్డారు మరికొందరు అరవైల్ని అందుకున్నారు. ఒకప్పుడు యువకులుగా ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్లుగా నటించిన వాళ్ళంతా చాలా ఏళ్ళకిందటే రిటైర్ అయిపోయారు.
కొంత మంది మాత్రం అప్పుడప్పుడు అక్కడక్కడా అమ్మపాత్రలు చేస్తూ మెరుస్తున్నారు.ఇదే తరహాలో నలభైల్లో ఒక తరం, యాభైల్లో ఒక తరం హీరోయిన్లుగా నటించి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వీరి సరసన నటించే వాళ్ళంతా దాదాపు కుర్రహీరోయిన్లే…ఇక వీరి విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయనుకున్న కుర్ర హీరోయిన్సే. తమకంటే భారీ ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలకు భార్యలుగా, మరదళ్ళుగా నటిస్తుంటారు.
వచ్చిన ఆఫర్‌ిను ‘నో’ చెప్పడమెందుకనో, మైలేజ్ పెరుగుతుందన్న ముందు చూపుతోనో, ప్యాకేజ్ బావుంటుందన్న ఆశకారణంగానో చాలా మంది స్టార్ హీరోయిన్ లు తమ తండ్రి వయసున్న హీరోలకు కూడా జోడీ కడుతుంటారు. అలా టాలీవుడ్ లో తండ్రి వయసు ఉన్న హీరోలతో నటించిన హీరోయిన్ లు ఎవరో ఓ లుక్కేద్దాం…
1) శ్రీలీల
రీసెంట్ గా విడుదలైన ధమాక సినిమాలో రవితేజ కు జోడీగా హీరోయిన్ శ్రీలీల నటించింది. రవితేజ వయసు 54 ఏళ్లు అయితే శ్రీలీల వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కానీ సినిమాలో మాస్ మహారాజ్ కు జోడీగా నటించింది.
2) శృతిహాసన్
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తన తండ్రి వయసున్న మెగాస్టార్ కు జోడీగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాదు నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా శృతి హీరోయిన్ గా నటించింది. ఏజ్ పరంగా చూస్తే వీరిద్దరిది కూడా తండ్రీ కూతుళ్ల వయసే ..
3) రితికాసింగ్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాలో హీరోయిన్ గా రితికా సింగ్ నటించింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ముప్పై ఏళ్ల పైనే ఉంటుంది.
4) లావణ్యత్రిపాఠి
నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయినా సినిమాలో లావణ్యత్రిపాఠి హీరోయిన్ గా నటించింది. లావణ్య త్రిపాఠి ఏజ్ గ్యాప్ సైతం ముప్పై ఏళ్ళపైమాటే.!
5) శ్రీదేవి
సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. ఒక సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి, వేటగాడు సినిమాలో అన్నగారికి జంటగా నటించింది. అక్కడ నుంచి వీళ్ళిద్దరిదీ హిట్ కాంబినేషన్ గా చాలా ఏళ్ళు నడిచింది.