సినిమా వాళ్ళు అనగానే లగ్జరీగా బ్రతుకుతారు… వాళ్లకు ఏ కష్టాలు ఉండవు అనే భావనలో జనాలు ఉంటారు. కాని వాస్తవాలు చూస్తే అందుకు భిన్నంగా ఉంటాయి. తీవ్ర అనారోగ్యాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే కొందరు మాత్రం వాటి నుంచి బయటపడ్డారు. క్యాన్సర్ సహా పలు తీవ్రమైన వ్యాధుల నుంచి బయటకు వచ్చారు. అలా బయట పడిన వాళ్ళు ఎవరో చూద్దాం.
సమంతా
ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుండగా… త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
సోనాలి బింద్రే
క్యాన్సర్ బారిన పడి ఈమె పెద్ద పోరాటమే చేసి చివరకు బయటకు వచ్చింది. ఇప్పుడు భర్తతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
హంస నందిని
ఈమె కూడా క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఒకానొక దశలో ప్రాణాలకు ఇబ్బంది అనే వార్తలు వచ్చాయి.
మమతా మోహన్ దాస్
ఈమె కూడా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది. రెండు సార్లు క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.