బావకు పసందైన విందు అందించింది వెంకీమామ కూతురు ఆశ్రిత. తానే స్వయంగా ఓ స్పెషల్ వంటకం చేసి బంగారు బావకు ప్రేమగా తినిపించింది. నేనేమైనా తక్కువ తిన్నానా అని చైతూ కూడా సుషి అనే ఓ వెరైటీ వంటకం చేసి మరదలికి తినిపించాడు.
ఈ సరదా సరదా వంటకాలను ‘’ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ యట్ షో యు విత్ మై బావా’’ అనే పేరుతో సండేకానుకగా తన బ్లాగర్స్ కి బిందాస్ వంటకాలను పరిచయం చేసింది. కుటుంబ బంధాలను, నిష్కపటమైన బావామరదళ్ళ అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ వీడియో నెట్టింట లైకుల సందడి చేసింది.
తాను ఫుడ్ బ్లాగర్ గా మారడం వెనుక ఒక ఇంట్రస్టింగ్ ఉందని , దానికి కారణం మానాన్న వెంకటేష్ , పెదనాన్న సురేష్ లేనని పేర్కొంది. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళిన నాన్న,పెదనాన్న ఆయా దేశాలు చుట్టివచ్చేవారని అక్కడి వింతలు విశేషాలు చాలా ఆసక్తిగా చెప్పేవారని చెప్పింది.
వాళ్ళు తిన్న ఫుడ్స్ టేస్ట్స్ తరచూ తమతో పంచుకునేవారని అలా వరలడ్ వైడ్ ఫుడ్ మీద ఒక ఇంట్రస్ట్ కలిగిందని అసలు విషయం చెప్పింది.
చిన్నచిన్నగా వంటలు చేయడం మొదలు పెట్టానని అలా బ్లాగర్ అయ్యానని వివరించింది. నిజానికి ఈ రంగంలోకి వస్తానని కూడా తాను అనుకోలేదని బ్లాగ్ రాస్తానన్నప్పుడు కుటుంబమంతా ప్రోత్సహించారని నాన్నైతే చాలా ఐడియాస్ ఇచ్చారని చెప్పుకొచ్చింది ఆశ్రిత.