హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో కొంచెం తక్కువే అని చెప్పాలి . మన టాలీవుడ్ హీరోస్ బయటివారినే ఎక్కువగా పెళ్లి చేసుకున్నారు కానీ కొంతమంది మాత్రం రీల్ లైఫ్ ని రియల్ లైఫ్ గా మార్చుకున్నారు..తమతో నటించిన వారినే పెళ్ళి చేసుకున్నారు.
1. క్రిష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణ విజయనిర్మలది హిట్ కాంబినేషన్ . వీరిద్దరూ తొలిసారిగా బాపు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా షూటింగ్ లో కలిసారు. అంతకు ముందే వారికి పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ వీరి ప్రేమకు అడ్డుకాలేదు . తిరుపతిలో క్రిష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు.
2.కమల్ హాసన్
ఇతను మొదట 1978లో డాన్సర్ వాణి గణపతిని పెళ్లిచేసుకొని 7 సంవత్సరాలు కాపురం చేశారు . తర్వాత నటి సారిక ని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి నటి గౌతమి తో 13 ఏళ్లు సహజీవనం చేశారు కమల్. వీరిద్దరు ద్రోహి సినిమాలో భార్య భర్తలుగా నటించారు .
3. పవన్ కళ్యాణ్
బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల కెమిస్ట్రీ సూపర్ గా పండింది . అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి సహజీవనానికి దారి తీసింది . తన మొదటి భార్యతో విడాకులు మంజూరు అయ్యాక , రేణు ను పెళ్లి చేసుకున్నాడు పవన్ . ఐతే పెళ్ళైన 3 సంవత్సరాలకే తనకి కూడా విడాకులు ఇచ్చి ., తీన్మార్ సినిమాలో తనతో నటించిన రష్యన్ నటిని పెళ్లిచేసుకున్నాడు.
4. నాగార్జున
నాగార్జున కి 1984 లో ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ తో వివాహం జరిగింది . ఐతే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు . పెళ్ళైన 6 ఏళ్లకే వీరిద్దరు విడిపోయారు . తర్వాత నాగార్జున హీరోయిన్ అమలతో ప్రేమలో పడి నాగేశ్వరరావు ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
5. శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ కూడా తనతో 4 సినిమాల్లో నటించిన హీరోయిన్ ఊహ ని తన జీవిత భాగస్వామి గా చేసుకున్నాడు. తన రెండో మూవీ షూటింగ్ సమయంలో ఊహ తో ప్రేమలో పడ్డ శ్రీకాంత్ 1997 లో పెళ్లి చేసుకున్నారు .
6. రాజశేఖర్
రాజశేఖర్ హీరోయిన్ జీవితతో కలిసి నటించిన మొదటి సినిమా తలంబ్రాలు . ఈ సినిమాలో జీవితని ప్రేమించి మోసం చేసిన రాజశేఖర్ నిజజీవితంలో మాత్రం పెళ్లి చేసుకొని చక్కగా చూసుకుంటున్నాడు.
7. మహేష్ బాబు
మహేష్ బాబు 3 వ సినిమా వంశీ షూటింగ్ సమయంలో ఆ సినిమా హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు. తర్వాత 4 ఏళ్ల డేటింగ్ అనంతరం పెద్దల అంగీకారంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు .
8. సూర్య
తెలుగు వారికి సూర్య , జ్యోతికలు చాలా పరిచయం . వీరిద్దరూ కలిసి నటించిన తమిళ సినిమాలు విజయం సాధించాయి . సూర్య హీరోగా నిలదొక్కుకున్నాడు అంటే అందుకు కారణం జ్యోతికనే అని చాలా సందర్భాల్లో సూర్య చెప్పాడు కూడా . వీరిద్దరు 2006 లో పెళ్లి చేసుకున్నారు .
9. నాగ చైతన్య
నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలో తండ్రి లాగే ప్రేమ వివాహానికే ఒకే చెప్పాడు . ఏమాయ చేసావే లో తనతో నటించిన సమంతతో ప్రేమలో పడిన చైతన్య కొన్నాళ్ళు డేటింగ్ చేసాక , పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు .