మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓకే బంగారం, మహానటి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ హీరో.
అయితే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హే సినామిక సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి 3న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డ నేపథ్యంలో మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అక్కినేని నాగచైతన్య రాబోతున్నారు. ఈ మేరకు ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.