తెలంగాణలో కూడా కరోనా వైరస్ తీవ్రంగా మళ్లీ భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా కేసులు అంతకంత పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 400 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 64,898 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 394 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 81 కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా కారణంగా నిన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 1669కి పెరిగాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,804 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 1,123 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సాధారణంగా తెలంగాణలో పాజిటివ్ కేసులు లెక్కలు మొదటి నుంచి అనుమానంగానే ఉంటున్నాయి. జిల్లాల్లో ఒకలా.. స్టేట్ బులెటిన్‌లో మరొకలా లెక్కలు చెప్తుంటారన్న విమర్శలు ఉన్నాయి.. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే 400 వరకు కేసులు నమోదైనట్టు చెప్తోందంటే.. తీవ్రత బాగానే పెరిగినట్టు. బీ కేర్‌ఫుల్.