కరోనా వైరస్ విజృంభిస్తున్న వేల ఏపీలో తాజాగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 161 కేసులు నమోదు రికార్డు అయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే నెల్లూరు లో 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలలో హైఅలెర్ట్ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీ మొత్తంలో కృష్ణా జిల్లాలోఒక్కసారిగా 23 కేసులు పెరగడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ జోన్‌గా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ప్రకటించారు.
ప్రస్తుతానికి అనంతపురంలో 2, చిత్తూరులో 9, తూర్పు గోదావరిలో 9, గుంటూరులో 20, కడపలో 19, కృష్ణలో 23, కర్నూల్ లో 1, నెల్లూరులో 32, ప్రకాశంలో 17, విశాఖపట్నంలో 14, పశ్చిమ గోదావరిలో 15 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటికి వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు.