కరోనా వైరస్ కారణంగా శ్రీకాళహస్తి పట్టణం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒకే యువకుడి నుంచి ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. దీనితో కొత్తగా శ్రీకాళహస్తి లో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు నుంచి వచ్చిన విద్యార్థి కుటుంబ సభ్యులే ఐదుగురు కాగా.. మిగిలిన ముగ్గురిలో అతని సన్నిహితులైన ఓ స్నేహితుడు, ఓ వార్డు వలంటీర్, ఈదులగుంటకు చెందిన ఓ యువకుడు ఉన్నాడు.
కొత్తగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో మొత్తం ఇప్పటివరకు శ్రీకాళహస్తిలో కరోనా కేసుల సంఖ్య 56 కు చేరుకుంది. మరో వైపు సదరు విద్యార్థి ఎక్కడెక్కడ తిరిగాడో అనేది పోలీసులు సేకరిస్తున్నారు.