దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగానే… రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తెలంగాణలో గడిచిన 24గంటల్లో 66,036మందికి టెస్టులు చేయగా ఏకంగా 364మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మరో 698మంది రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది.
కొత్తగా మరో 189మంది కరోనాను జయించగా, మరో ఇద్దరు వైరస్ తో పోరాడి ప్రాణాలు విడిచారు. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 75, జగిత్యాల 28, మహబూబ్ నగర్ 14, మేడ్చల్ 32, నిర్మల్ 10, నిజామాబాద్ 14, రంగారెడ్డి 31, సంగారెడ్డి 16, వరంగల్ అర్బన్ 12, యాదాద్రిలో 10 కేసులు వచ్చాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం బులిటెన్ ఇచ్చింది.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య- 3,02,724
యాక్టివ్ కేసుల సంఖ్య- 2,607
డిశ్చార్జ్ కేసుల సంఖ్య- 2,98,451
మరణాలు- 1,666