ప్రపంచ వ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా విశాఖలో కరోనా వైరస్ అనుమానంతో ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరికి నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు వెల్లడించారు. మరొకరి సాంపిల్స్ కూడా తీసుకుని పూణే కు పంపించామని తెలిపారు. ఇక చైనా నుంచి బుధవారం ఫ్లయిట్ లో విశాఖ వచ్చిన వారిని 50 రోజుల పాటు పరిశీలనలో ఉంచుతామని తెలిపారు. విశాఖకు సంబంధిన కోవిడ్ అనే యువకుడి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతిరావు వెల్లడించారు.