తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఏపీలో తీవ్రత చాలా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం స్థిరంగా కంటిన్యూ అవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 299 మందిలో పాజిటివ్ తేలింది. కరోనాతో నిన్న మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇక తాజాగా 379 మంది కోలుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
మొత్తం పాజిటివ్ కేసులు: 2,91,666
డిశ్చార్జీలు: 2,85,898
యాక్టివ్ కేసులు : 4,191
కరోనా మరణాలు : 1,577
ఏపీ విషయానికి వస్తే.. గడిచిన 24గంటల్లో కొత్తగా 114మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొత్త మరణాలేవీ నమోదు కాలేదు. ఇక కరోనా నుంచి కొత్తగా మరో 326మంది కోలుకున్నారు.
ఏపీలోని మొత్తం బాధితులు- 8,82,929
కోలుకున్నవారు- 8,73,803
మరణాల సంఖ్య- 7,139
యాక్టివ్ కేసుల సంఖ్య- 1,987