మునుగోడు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రకటనపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఎన్నికల సంఘం నివేదికపై పరిశీలనలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని పేర్కొంది. కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
అంతకు ముందు మునుగోడు ఓటర్ల జాబితా నివేదికను హైకోర్టుకు ఎన్నికల సంఘం సమర్పించింది. మొత్తం ఇప్పటి వరకు ఓటు హక్కు కోసం 25వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. అందులో 7వేల దరఖాస్తులను తిరస్కరించినట్టు పేర్కొంది.
12వేల దరఖాస్తులకు మాత్రమె అంగీకారం తెలిపినట్టు వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులు పెండింగ్ లో వున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టును పిటిషన్ కోరారు.
దీంతో పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించి పెండింగ్ లో ఉన్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ లిస్టులో అక్రమాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందన బీజేపీ ఆరోపణలు చేస్తోంది. కేవలం రెండు నెలల్లో నూతనంగా ఓటు హక్కు కోసం 25వేల మంది దరఖాస్తు చేసుకోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.