జస్టిస్ ఫర్ దిశ వ్యవహరంలో విచారణ వేగవంతం చేసేందుకు మరో అడుగు పడింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.