బైంసా ఘటన లో జర్నలిస్టు సిద్ధుకు హైకోర్టు లో ఊరట లభించింది. ఘటన పై సమాచారం తెలుసుకోవడానికి వెళ్లిన జర్నలిస్టు సిద్దు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై కేసు నమోదు చెయ్యటంపై హైకోర్టు ను ఆశ్రయించాడు జర్నలిస్ట్ సిద్దు. 41 ఏ సీఆర్పీసి కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.