తెలంగాణలో ప్రభుత్వం ప్రజలవైపు ఉండదా అంటూ కామెంట్ చేసింది హైకోర్ట్. ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో… కార్మికులు చర్చలకు వెళ్లాలి, సమ్మెతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు అని కోర్టు వాఖ్యానించగా…. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఎండీ కూడా లేరని యూనియన్ తెలిపింది. దీంతో… మీరు ప్రజలవైపు ఉన్నారా…? ఇప్పటి వరకు ఎందుకు ఆర్టీసీ ఎండిని నియమించ లేదు అని ప్రశ్నించింది. దీంతో తక్షణమే ఆర్టీసీ ఎండిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్ట్.
అంతేకాదు… రెండు రోజుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి… రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఈగో’లకు వెళ్లటం వల్ల సమస్యలు పరిష్కారం కావని, ఇరు వర్గాలు మెట్టుదిగి సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేసింది. కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించింది. రెండు రోజుల్లో ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికా చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వం డిటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది.