హైదరాబాద్ బోయినిపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీమంత్రి అఖిలప్రియను మూడు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తిరిగి తరలించారు. అంతకుముందు అఖిలప్రియకు కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు ఈసీజీ, గైనకాలజీ విభాగంలోనూ పరీక్షలు నిర్వహించారు. ఇక అఖిలప్రియ తరఫున ఆమె న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎల్లుండి విచారణ జరగనుంది.
మూడు రోజుల కస్టడీలో అఖిలప్రియ నుంచి పోలీసులు భూవివాదానికి సంబంధించి కీలక సమాచారం సేకరించారు. సమస్య పరిష్కారించుకుందామని ఎన్నో సార్లు కోరినా.. ప్రవీణ్ రావు సోదరులు స్పందించలేదని.. అందుకే కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో అఖిలప్రియ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. కాగా, ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆఖిలప్రియను కస్టడీలో భాగంగా విచారించారు.