2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణపై రేవంత్ రెడ్డి వేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ పరిధి సరిపోదని రేవంత్ పిటిషన్ లో కోర్టును కోరుతూ… విచారణను సీబీఐ, ఈడీ,నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని కోరారు.
ఈ కేసులో రేవంత్ రెడ్డి తరుపున వాదించిన న్యాయవాది రచనా రెడ్డి కేసును విచారించేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉన్నా ఈడీ, ఎన్ సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10 లోగా తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.