ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విధించిన స్టే ను… ఈనెల 10 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జీవోలపై మధ్యంతర పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాది గోపాల్ శర్మ టిషన్ పై మరోసారి వాదనలు కొనసాగాయి.
విచారణలో భాగంగా… ధరణి జీవోల పై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు. ధరణిపై మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయన్న ఏజీ వాదించారు. అయితే సేకరించిన డేటాకు చట్టబద్ధతమైన భద్రత ఉండాలసిందేనన్న హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
అయితే, తాము రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించ లేదని, పాత పద్ధతిలో కొనసాగించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని హైకోర్టు సూచించింది.