ఆర్టీసీ ఎండిపై హైకోర్టు సీరీయస్ - Tolivelugu

ఆర్టీసీ ఎండిపై హైకోర్టు సీరీయస్

ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మపై హైకోర్టు సీరీయస్ అయ్యింది. ప్రభుత్వంకు సునీల్‌ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని, మంత్రికి కూడా తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లే అని వ్యాఖ్యానించింది. క్యాబినెట్‌కు సైతం తప్పుడు లెక్కలు ఇచ్చారని, సీఎంను సైతం ఇవే తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారంది.

తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని రవాణ మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావటం లేదన్న హైకోర్టు, జీహెచ్‌ఎంసీ బకాయిలే లేనప్పుడు ఎందుకు అడుగుతున్నారని నిలదీసింది. బకాయిలు లేకపోతే మంత్రి ఇవ్వాలి అని ఎందుకు చెప్పారని నిలదీసింది. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో పాట పాడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టుతో… వ్యవహరించే తీరు ఇదేనా అని ఉన్నతాధికారులను ప్రశ్నించింది కోర్టు.

ఆర్టీసీ యాజమాన్యంకు, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే… ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం ముందుకు రావటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ శాఖల మధ్య పూర్తిగా సమన్వయం లోపించిందని, నా స్థానంలో 5 నిమిషాలు మీరు ఉండి చూస్తే మీ నివేదికలు నమ్మేవిధంగా ఉన్నాయో అర్థమవుతోందని కోర్టు స్పష్టం చేసింది.

మీరు రవాణా శాఖ మంత్రితో తప్పుడు ఘణాంకాలతోనే అసెంబ్లీ వేదికగా తప్పులు మాట్లాడించారని, అవి తప్పులు కాకపోతే ఇప్పుడు కోర్టుకు ఇచ్చిన నివేదిక తప్పవుతుందని… లేదా అసెంబ్లీ నుండే ప్రజలకు తప్పులు చెప్పినట్లవుతుంది కదా అంటూ ఇంచార్జ్ ఎండిపై మండిపడింది కోర్టు.

ALSO READ: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ లైవ్‌ అప్డేట్స్

https://tolivelugu.com/hearing-going-on-on-rtc-strike-in-telangana-high-court/

 

Share on facebook
Share on twitter
Share on whatsapp